Munugode ByPoll: మునుగోడు `గుర్తు`ల గోల్ మాల్‌ , రిట‌ర్నింగ్ అధికారిపై ఈసీ వేటు

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ తొలి త‌ఢాఖా చూపింది. ఆ పార్టీ మ‌ద్ధ‌తుతో చేసిన ఫిర్యాదు మేర‌కు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం

  • Written By:
  • Updated On - October 20, 2022 / 03:46 PM IST

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ తొలి త‌ఢాఖా చూపింది. ఆ పార్టీ మ‌ద్ధ‌తుతో చేసిన ఫిర్యాదు మేర‌కు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. ఆర్వోను మార్చాలని ఇసి నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను ఇసికి అధికారులు పంపారు. కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. యుగ తులసి ఫౌండేషన్ ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తరువాత మార్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శివకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదిత‌మే.

టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉంటుందని భావించే పలు చిహ్నాలు రిజిస్టర్డ్ కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) శిబిరంలో గుబులు మొదలైంది.రోడ్డు రోలర్, కెమెరా, చపాతీ రోలర్, టెలివిజన్, ఓడ, కుట్టు మిషన్, సబ్బు డిష్ వంటి గుర్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో తమ కారు గుర్తులా ఉన్నాయని వాటిని తొలగించాలని టీఆర్ఎస్ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని కోరింది. అంతేకాదు, టీఆర్‌ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దాని మాదిరిగానే కనిపించే ఎనిమిది చిహ్నాలను తొలగించాలని ఈసీని ఆదేశించాలని కోరింది, అయితే ఈసీ ప్రక్రియను సెట్ చేసినందున ఉప ఎన్నికలో జోక్యం చేసుకోలేమని కోర్టు మంగళవారం పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read:   KCR Munugode Tour: మునుగోడుకు కేసీఆర్.. మూడు రోజులు అక్కడే!

ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తుల‌కు సంబంధించిన జీవోల‌ను విడుద‌ల చేసిన త‌రువాత మార్పు చేయ‌డాన్ని ఈసీ తప్పుబ‌ట్టింది. సింబ‌ల్స్ స్థానాల‌ను మార్చేసిన ఆర్వోను స‌స్సెండ్ చేస్తూ ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికలలో గుర్తింపు లేని పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వల్ల పార్టీ కనీసం నలుగురు అభ్యర్థులు ఓడిపోయారని టీఆర్ఎస్ భావిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓట్లు తగ్గాయని చెప్పారు. ఇండిపెండెంట్లకు అధికార పార్టీకి చెందిన ఓట్లు ప‌డ‌డంతో కొందరు టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలుపొందారు

2014 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఈవీఎంపై ఉన్న కారు గుర్తును పోలి ఉన్న‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థికి 50 వేలకు పైగా ఓట్లు రావడంతో మా అభ్యర్థి మంద జగ‌న్నాథం ఓడిపోయారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ను పోలిన ఇతర గుర్తులు కూడా మా ఓట్లను చీల్చుతున్నాయి’’ అని వినోద్‌కుమార్‌ అన్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో 1,400 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ గెలుపొందగా, ఇండిపెండెంట్ అభ్యర్థి బండారు నాగరాజుకు చపాతీ రోలర్ గుర్తు (బోర్డుతో కూడిన రోలింగ్ పిన్) కేటాయించారని, అతను 3,700 ఓట్లకు పైగా పోలయ్యాడని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు నాగరాజు ఓట్ల కారణంగా పార్టీ ఓడిపోయిందని వినోద్ చెబుతున్నారు.

Also Read:  Sex Criminals: `సెక్స్ క్రిమిన‌ల్స్`పై మంత్రి కేటీఆర్ సంచ‌ల‌నం

మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినయ్‌కృష్ణారెడ్డి, ఇతర ఎన్నికల అధికారులు గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను సోమ‌వారం ప్రారంభించారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియను కొనసాగించవద్దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులతో కూడిన బృందం అధికారులకు విన్నవించింది. అయిన‌ప్ప‌టికీ ఎన్నికల సంఘం గుర్తు కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం లాటరీ డ్రాలో చిహ్నాలను అందజేసినట్లు రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యాల ఆధారంగా ఈసీ తన వద్ద ఉన్న ఉచిత చిహ్నాల జాబితా నుంచి ఆటో, ట్రక్ వంటి సంకేతాలను తొలగించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.