Munugode: మునుగోడులో పండగ వాతావరణం. ముక్క..చుక్కకు..ఫుల్ గిరాకీ…ఎంత తాగారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మునుగోడు ఉపఎన్నిక...తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ప్రధాన పార్టీలన్నీ మునుగోడులోనే మకాం వేశాయి. పోలింగుకు సమయం దగ్గరపడుతున్న... ఈనేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 09:57 AM IST

మునుగోడు ఉపఎన్నిక…తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ప్రధాన పార్టీలన్నీ మునుగోడులోనే మకాం వేశాయి. పోలింగుకు సమయం దగ్గరపడుతున్న… ఈనేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఎవరికి వారే తగ్గాఫర్ అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రతిఓటరునూ కలుస్తూ ఓటేయ్యమని ప్రాదేయపడుతున్నారు. ఇక మునుగోడు స్థానిక ఓటర్లకు ప్రతిరోజూ పండగ వాతావరణమే. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఏ ఇంట చూసిన మాంసాహర వంటకాలు ఘుమఘుమలాడిస్తున్నాయి. దీంతో మునుగోడులో మాంసం, మద్యం విక్రయాలు ఊహించనిస్థాయిలో పెరిగాయి.

మునుగోడులో మొత్తం ఏడు మండలాల పరిధిలో అక్టోబర్ 22నుంచి ఏకంగా 160.8కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఈనెల ముగిసేసరికి రూ. 230కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మునుగోడులో అధికంగా, గట్టుప్పల్లో అత్యల్పంగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఒక్క నెలలోనే రూ. 300కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇక మాంసం అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని చికెన్ షాపుల నుంచి క్వింటాళ్ల కొద్ది మాంసం వెళ్తోంది. మునుగోడులో ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు రోజుకు రెండు పూటల భోజనం పెడుతన్నారు. అంతేకాదు గ్రామస్థులకు మందు విందు కూడా ఇస్తున్నారు. దీంతో చికెన్, మటన్ విక్రయాలు భారీ పెరిగాయి. కేవలం మాంసం కోసం ఇప్పటివరకు 50కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. గతంలో 50 కిలలోల చికెన్ అమ్మే షాపులు ఇప్పుడు 400కిలోల వరకు అమ్ముతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పుణ్యామా అంటూ చికెన్, మటన్ విక్రయాలు భారీగా పెరిగాయి… భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.