Mulugu: మావోల కదలికలు.. భారీ ‘డంప్’ స్వాధీనం!

ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మండలాల పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందితో కలిసి మేడారం రిజర్వ్ ఫారెస్ట్‌ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు గురువారం గుర్తించారు.

  • Written By:
  • Publish Date - March 4, 2022 / 12:24 PM IST

ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మండలాల పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందితో కలిసి మేడారం రిజర్వ్ ఫారెస్ట్‌ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు గురువారం గుర్తించారు. మేడారం రిజర్వ్ ఫారెస్ట్ లోని వివిధ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు అమర్చి పోలీసు సిబ్బందిని హతమార్చేందుకు మావోయిస్టు నేతలు వ్యూహం రచిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అడవిలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో 74 జిలెటిన్ స్టిక్స్, నాలుగు డిటోనేటర్లు, ఒక ఎలక్ట్రికల్ స్విచ్, ఒక పెద్ద బ్యాటరీ సెట్, 33 చిన్న బ్యాటరీలు, ఒక ఎలక్ట్రికల్ వైర్ బండిల్, మూడు ప్లాస్టిక్ షీట్లతో సహా ప్లాస్టిక్ డ్రమ్ములో పేలుడు పదార్థాలు దాచి ఉంచారు. దొరికిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మావోయిస్టులు జయశంకర్-ములుగు-మహబూబాబాద్-వరంగల్ కమిటీ (జేఎంఎండబ్ల్యూ), బడి చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, కురసం మంగు అలియాస్ భద్రు, ముచ్చెకి ఉంగల్ అలియాస్ రాంకర్ అలియాస్, కొవ్వాసి గంగ అలియాస్ మహేస్, సోడి కోసి అలియాస్ ఝాన్సీలు సమావేశమైనట్టు పోలీసుల సమాచారం.