Site icon HashtagU Telugu

Seethakka with Revanth: రేవంత్ కు ‘బర్త్ డే’ విషెస్ చెప్పిన సీతక్క!

Revanth And Seethakka

Revanth And Seethakka

ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఆయన బర్త్ డేను పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్‌రెడ్డిని కలుసుకొని, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజల సంక్షేమం కోసం పోరాటమే ఊపిరిగా బ్రతుకుతున్న ఆత్మీయ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేసింది. రేవంత్, సీతక్క  మధ్య చక్కని అనుబంధం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపైమరొకరు ప్రేమ, అప్యాయతను చాటుతుంటారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. తన మాటలనే తూటాలుగా మార్చి టీఆర్ఎస్ పార్టీపైకి ఎక్కుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మునుపటి జోష్ మళ్లీ కనిపించసాగింది. క్రమక్రమంగా పార్టీ ప్రాభవం పెరగసాగింది. నిరాశ, నిస్పృలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆశా కిరణం అయ్యాడు.