Site icon HashtagU Telugu

Mulugu Congress Public Meeting : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు.. ములుగు కాంగ్రెస్ సభ హైలైట్స్

Mulugu Congress Public Meeting Highlights

Mulugu Congress Public Meeting Highlights

ఈసారి తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పక్క ప్రణాళిక తో ముందుకు వెళ్తుంది. ప్రజలను ఆకట్టుకునే హామీల (Congress Guarantees)నే కాకుండా ఇతర పార్టీల నేతలు సైతం టికెట్ లతో ఆకర్షిస్తూ ముందుకు వెళ్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. ఇప్పటికే 55 మందితో కూడిన అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన కాంగ్రెస్.. అతి త్వరలోనే మిగతా అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటె నిన్నటి నుండి ములుగు (Mulugu) జిల్లాలో బస్సు యాత్ర (Congress Bus Yatra) మొదలుపెట్టింది. ఈ సందర్బంగా ములుగు (Mulugu)లో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభ (Congress Vijaya Bheri Sabha)లో పాల్గొన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లు బిఆర్ఎస్ , బిజెపి లపై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ది అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇస్తానన్న మూడెకరాల భూమి వచ్చిందా? రూ.లక్ష రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చారు, వచ్చాయా? అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు.. అవినీతి చేశారా లేదా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారు? అని రాహుల్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా.. కేసీఆర్‌పై ఒక్కకేసు పెట్టలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే. దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నాం.. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు తెలపండి అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో మహిళలకు వారి అకౌంట్‌లో ఉచితంగా డబ్బు పడుతోందని, తెలంగాణలో కూడా అలాగే ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, కావాలంటే కర్ణాటక వెళ్లి చూడాలని సూచించారు. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తాం అని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని, రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని ప్రియాంకగాంధీ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలన్నారు. అంతకు ముందు రాహుల్ , ప్రియాంక లు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అర్చకులు వారి చేత రుద్రేశ్వరునికి అభిషేకం, పూజలు చేయించారు. అనంతరం గైడ్‌ ద్వారా ఆలయ విశిష్టతలను వారు తెలుసుకున్నారు.

Read Also : Ramgiri Fort : సీతారాములు న‌డ‌యాడిన కొండ… ఈ రామ‌గిరి ఖిల్లా…