Site icon HashtagU Telugu

Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?

Aurangzebs Tomb Mughal Descendant Yakub Habeebuddin Tucy Un

Aurangzebs Tomb: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై ఈ మధ్య కాలంలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా  ఖుల్దాబాద్‌లో ఉన్న ఈ సమాధిని తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు డిమాండ్ చేశాయి. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కోణంలో వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ఓ బీజేపీ అగ్రనేత ఔరంగజేబు చరిత్రపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో నివసించే యాకుబ్ హబీబుద్దీన్ టూసీ నేరుగా ఐక్యరాజ్యసమితి  సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌కు లేఖ రాశారు. యాకుబ్(Aurangzebs Tomb) తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా చెప్పుకుంటారు. ఆంటోనియో గుటెరెస్‌కు రాసిన లేఖలో.. ఖుల్దాబాద్‌లో ఉన్న  ఔరంగజేబు సమాధిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఔరంగజేబు  సమాధి ప్రాంతానికి పెద్ద చరిత్ర ఉందని, భారత్‌లోని ఈ తరహా చారిత్రక కట్టడాల పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని యాకుబ్ హబీబుద్దీన్ టూసీ కోరారు.

Also Read :ATMs In Trains: రైళ్లలోనూ ఏటీఎంలు.. రైల్వేశాఖ ట్రయల్ సక్సెస్

లేఖలో ఇంకా ఏముంది ? 

‘‘ఔరంగజేబు  సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గతంలో ప్రకటించారు. ‘పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం-1958’ కింద దాన్ని రక్షించాలి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం రక్షిత స్మారక చిహ్నం సమీపంలో ఎటువంటి అనధికారిక నిర్మాణం చేయకూడదు. ఆ సమాధి, దాని పరిసరాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. అక్కడ తవ్వకాలు చేపట్టకూడదు. ఇలాంటివి ఏవైనా పనులు చేస్తే చట్టవిరుద్ధం. ఆ విధంగా చేసేవారు చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారు’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖలో యాకుబ్ పేర్కొన్నారు. వెంటనే ఆ సమాధిని రక్షించడానికి తగిన సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. ‘‘సినిమాలు, మీడియా కథనాలు, సామాజిక వేదికలలో ఔరంగజేబు  గురించి తప్పుగా చూపించారు. తద్వారా ప్రజల మనోభావాలను తారుమారు చేశారు. ఫలితంగా అనవసరమైన నిరసనలు, ద్వేషపూరిత ప్రచారాలు, దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి చర్యలు ఇటీవలే జరిగాయి’’ అని లేఖలో యాకుబ్ ప్రస్తావించారు.

Also Read :ED Raids : సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ రైడ్స్.. కారణాలివీ

యాకుబ్ హబీబుద్దీన్ టూసీ గురించి..