రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు..ఇదే సత్యం. తాజాగా మంద కృష్ణ (Manda Krishna) అదే నిరూపించాడు. నిన్నటి వరకు సీఎం రేవంత్ (Revanth)పై నిప్పులు చెరిగిన ఈయన..ఈరోజు రేవంత్ కు సోదరుడిగా ఉంటానని చెప్పి ఇదే రాజకీయం అని మాట్లాడుకునేలా చేసాడు. ప్రస్తుతం ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న కట్టుబాటు, ప్రభుత్వ విధానాన్ని మందకృష్ణ అభినందించారు. ప్రభుత్వం న్యాయ పరంగా వర్గీకరణ ప్రక్రియను చేపట్టిందని, దీనికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
World Health Organization : ప్రత్యామ్నాయ ఉప్పుతో గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, ఎస్సీ ఉపకులాల వర్గీకరణను రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, పూర్తి న్యాయబద్ధంగా చేపట్టిందని వెల్లడించారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, న్యాయ కమిషన్ ద్వారా నివేదికలు రూపొందించి, తుది నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఈ అంశం కోసం పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం సూచనల మేరకు.. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. వర్గీకరణ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపకులాల స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని సూచనలు ఇచ్చారు. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అంగీకరించడాన్ని మందకృష్ణ ప్రశంసించారు. అయితే మొన్నటి వరకు రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మందకృష్ణ సడెన్ గా ప్రశంసలు కురిపించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.