హైదరాబాద్ లో శనివారం మాదిగ విశ్వరూప సభ (Madiga Vishwarupa Sabha) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా మోడీ (Modi) హాజరయ్యారు. ఈ సభ వేదిక ఫై మోడీని పట్టుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (manda krishna madiga) కంటతడి పెట్టుకున్నారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… నా జాతిని ఆదుకోవడానికి వచ్చిన ప్రధాని మోదీ, మన వద్దకు ఆయనను తీసుకువచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ అంటూ మందకృష్ణ ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్నా… మీకు తమ్ముళ్లుగా మేం భావించుకుంటున్నాం.. మీకు దణ్ణం పెడుతున్నాను… 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమం ప్రారంభమైందని, 30 ఏళ్లుగా తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. మాదిగలకు అన్యాయం జరిగిందనే ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నామన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వేసిన కమిషన్లు కూడా మాదిగలకు అన్యాయం జరిగినట్లు చెప్పాయని, కానీ ఎవరూ న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. మా వాటా మాకు దక్కాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి.. కానీ హామీని మాత్రం నెరవేర్చలేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది. బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం” అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు.
ఇక సభ వేదిక ఫై మోడీ మాట్లాడుతూ ..ఎస్సీ వర్గీకరణ (SC Categorisation)కు కట్టుబడి ఉన్నామని..త్వరలోనే వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను విరోధులుగా చూస్తున్నాయని మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు.
Read Also : SC Categorisation : త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ – హైదరాబాద్ వేదికగా ప్రధాని హామీ