తెలంగాణ (Telangana ) లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారం చేపట్టిన దగ్గరి నుండి ప్రతిఒక్క శాఖలో అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీడీవోల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 395 మంది మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారులను బదిలీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా.. శనివారం ప్రభుత్వం 32 మంది డిప్యూటీ కలెక్టర్లతో పాటు 132 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-1లో 84 మంది తహసీల్దార్లు, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.]
Read Also : Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?