Site icon HashtagU Telugu

Congress : త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది – వైసీపీ ఎంపీ విజయసాయి

Vijayasai Ts Govt

Vijayasai Ts Govt

కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) వరుసగా అతి త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ కు మొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గట్టి హెచ్చరికే జారీ చేసారు. ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ ఎంపీ..సైతం త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో తాజాగా కాంగ్రెస్ సైతం మళ్లీ జోరు అందుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల గా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పేరు పలుకుతున్నారు. దీనికి కారణం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైస్ షర్మిల చేపట్టడమే. ఎప్పుడైయతే షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీ లో చేరబోతుందని , ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతుందని వార్తలు బయటకు వచ్చాయో..అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం షర్మిల ఏపీ పగ్గాలు పట్టుకొని తన దూకుడు ను కనపరుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఫై నిప్పులు చేరగడం, సొంత అన్న జగన్ ఫై కూడా విమర్శలు చేస్తుండడం తో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో వైసీపీ నేతలు కాంగ్రెస్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఎంపీ విజయసాయి (YCP MP MP Vijayasai Reddy) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని , కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని, కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం ఆశించినా నెరవేరలేదన్నారు. పదేళ్ల తరువాత అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే తెలంగాణ లో ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also : AP : చివరి నిమిషంలో టూర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్న షర్మిల..