Site icon HashtagU Telugu

MP Santosh in Bigg Boss: బిగ్ బాస్ వేదికపై జోగినపల్లి సంతోష్

Whatsapp Image 2021 12 12 At 23.19.00 Imresizer

MP Santosh

కింగ్ నాగార్జున బిగ్ బాస్ వేదిక నుండి ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. 2021 లో ఇంకా మూడు వారాలు మిగిలి ఉందని, ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని కోరారు.

బిగ్ బాస్ వేదికపైకి ఎంపీ సంతోష్ కుమార్ వచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విషయాలను డిస్కస్ చేస్తూ, మీరు ఇప్పటి వరకు ఓ మూడు కోట్ల వరకు మొక్కలు నాటారా ? అంటూ హోస్ట్ నాగార్జున ఎంపీ సంతోష్ కుమార్ ను అడిగారు. దానికి ఆయన 16 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.

గత నాలుగైదు సంవత్సరాలుగా, మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకొని కోట్లది మొక్కలు నాటారు నిజంగా మీ కృషికి హ్యాట్సఫ్ సర్ అంటూ జోగినిపల్లి సంతోష్ కుమార్ ని నాగ్ అభినందించారు.

ఒక్క మనిషి తన ఆలోచనతో, ప్రకృతి బావుండాలనే తపనతో కోట్లది మొక్కలు నాటితే బిగ్ బాస్ హౌస్ పిలుపునిస్తే ఇంకా ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోండని ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టి భవిష్యత్ తరాలు ఈ భూమిపై మనుగడ సాగించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాగార్జున ప్రేక్షకులకు సూచించారు.

ప్రతి ఒక్కరికి మొక్కలు నాటాలి, కాపాడాలి అనే ఆలోచనను కలిగించాలని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం తీసుకున్నామని, బిగ్ బాస్ లాంటి అద్భుతమైన షోలో మా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జునకు, ‘స్టార్ మా’ కు, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్స్ కి, టెక్నిషీయన్లకి ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”, వారి మాటలు, స్పూర్తి నన్నెంతగానో కదిలించాయని, తాను కూడా వారు ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకొని మొక్కలు పెంచుతూ సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాగ్ తెలిపారు.