Site icon HashtagU Telugu

MP Santhosh: రూమర్స్ కు చెక్.. కేసీఆర్ వెంటే సంతోష్!

Santhosh

Santhosh

TRS MP సంతోష్ కుమార్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు వినిపించాయి. ఈడీ దాడుల కారణంగానే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేకేత్తించింది. దీంతో గులాబీ కోట బద్దలు ఖాయం అంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలకు దిగాయి. అయితే ఈ వార్తలను ఎంపీ సంతోష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అసలేం జరిగిందో తెలియక…ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ వ్యక్తగత వ్యవహారాలతోపాటు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటూ వస్తున్నారు సంతోష్ కుమార్.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ టూరుకు బయలుదేరారు. ఈ టూర్ నేపథ్యంలో అందరికంటే ఓ వ్యక్తి హైలైట్ అయ్యారు. ఆయనే ఎంపీ సంతోష్ కుమార్. వరంగల్ టూర్ లో సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండటంతో రూమర్స్ కు చెక్ పెట్టినట్టయింది. ఎంపీ సంతోష్ ను చూసిన టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ టూర్ తో తనపై వస్తున్న విమర్శలకు సంతోష్ చెక్ పెట్టినట్టయింది.