Site icon HashtagU Telugu

BRS : బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజీనామా..

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

బీఆర్‌ఎస్‌ (BRS)కు మరో భారీ షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ రంజిత్‌ రెడ్డి (MP Ranjith Reddy) పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR)కు లేఖ పంపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ‘ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి సేవ చేసేoదుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని వారికి విజ్ఞప్తి. ఇన్నాళ్లూ నాకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు’ అంటూ తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు ఎంపీ రంజిత్‌ రెడ్డి.

We’re now on WhatsApp. Click to Join.

“మాజీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వాసులను ప్రభావితం చేసే కీలకమైన సమస్యలను పరిష్కరించేందుకు మరియు పరిష్కరించడానికి పార్టీ అందించిన అమూల్యమైన అవకాశం కోసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సామర్థ్యాలపై మీకున్న నమ్మకమే నా పార్లమెంట్ నియోజకవర్గమైన చేవెళ్ల నియోజకవర్గాలకు సమర్థవంతంగా సేవ చేసేందుకు నాకు శక్తినిచ్చింది. ఈ ప్రయాణంలో మీ స్థిరమైన మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడను. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించాలనే కఠిన నిర్ణయానికి వచ్చాను. బరువెక్కిన హృదయంతో నేను BRS పార్టీకి రాజీనామా పత్రాన్ని సమర్పించి నా సభ్యత్వాన్ని వదులుకుంటున్నాను. నా హయాంలో పార్టీ అందించిన మద్దతు మరియు మద్దతుకు నా ప్రగాఢమైన అభినందనలు తెలియజేస్తున్నాను,” అని ఆయన అన్నారు. అయితే.. రంజిత్‌ రెడ్డి తాను చేరబోయే పార్టీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే.. వరసగా బీఆర్‌ఎస్‌ పార్టీని నేతలు వీడుతుండటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. నిన్నటికి నిన్న ఆరూరి రమేష్ (Aruri Ramesh) బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఈ రోజు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే.. వరంగల్‌ ఎంపీ టికెట్‌ను ఆరూరి రమేష్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : Zomato: జొమాటోకు బిగ్ షాక్‌.. రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తున్న గుజ‌రాత్ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌..!