T Congress : కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్..

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 02:16 PM IST

అంత భావించినట్లే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy ), బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి..బిఆర్ఎస్ లో చేరారో..ఇప్పుడు మళ్లీ సొంత గూటికే వస్తున్నారు. పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవులు అనుభవించి..కేసీఆర్ (KCR) కు దగ్గరగా ఉన్న వ్యక్తులు సైతం ఇప్పుడు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్సీ (Deepa Dasmunsi) సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్‌ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఆదివారం ఉదయమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా సీఎం రేవంత్ కాంగ్రెస్‌ పావులు కలుపుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే.

Read Also : Paytm FasTag: మీ పేటీఎం ఫాస్టాగ్‌ డీయాక్టివేట్ చేయాలా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సిందే..!