Site icon HashtagU Telugu

Shock To BRS: కారు పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ పసునూరి

Shock To Brs

Shock To Brs

Shock To BRS: తెలంగాణలో లోకసభ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. రెండ్రోజుల క్రితం ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు షాకిస్తూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా కారు పార్టీకి మరో షాక్ తగిలింది.

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శనివారం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. గురువు కొండా సురేఖ అడుగుజాడల్లో నడిచానని, పార్టీ అమలు చేస్తున్న 6 హామీల వల్ల ప్రభావితమయ్యానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానని ఉద్ఘాటిస్తూనే, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ‘ప్రజాపాలన’లో భాగం కావాలని ఆశించారు.

తెలంగాణ పోరాటంలో భాగం కాని వారికి బీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పించిందని, తెలంగాణను ద్వేషించిన వారికే మంత్రి పదవులు కట్టబెట్టిందని దయాకర్ ఆరోపించారు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మరియు కాంగ్రెస్‌లో నమ్మకమైన కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు.

Also Read: Lasya Nandita: కేసీఆర్ ను కలవనున్న లాస్య నందిత సోదరి