Site icon HashtagU Telugu

Gadwal War : గద్వాల్ లో ఆ ఇద్దరి పెత్తనం ఏంటి..? మండిపడుతున్న అధికారులు

Mp Mallu Ravi, Former Mla S

Mp Mallu Ravi, Former Mla S

జోగులాంబ గద్వాల్ (Jogulamba Gadwal) జిల్లాలో ప్రస్తుత రాజకీయ వాతావరణం హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ (MP Malluravi, former MLA Sampath Kumar)లు జిల్లాలో పాలనా వ్యవహారాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా అధికారులపై అసలైన ప్రభావం ఈ ఇద్దరికే ఉందన్న ప్రచారం జిల్లా పాలనపై విమర్శలు వస్తున్నాయి.

Arvind Store : ‘మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ’ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు వంటి కీలక వ్యవహారాల్లో ఈ ఇద్దరి సూచనలే ఫైనల్ అని చెబుతున్నారు. అధికార యంత్రాంగం డెసిషన్స్ తీసుకోవడంలో స్వతంత్రత కోల్పోయిందన్న వాదన బలపడుతోంది. ముఖ్యంగా పదవిలో లేని సంపత్ కుమార్ హస్తక్షేపంపై అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), బీఆర్‌ఎస్‌కు చెందిన విజయుడు (అలంపూర్) ఈ పరిస్థితుల్లో తమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపలేకపోతున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో గద్వాల్ జిల్లాలో ప్రజాప్రతినిధుల కన్నా కేబినెట్ వెలుపల ఉన్న నేతలకే అధికారం ఉండటమేనా అన్న ప్రశ్నలు రాజుకుంటున్నాయి. అధికార పార్టీ లోపలే వర్గపోరు, నాయకత్వ కలహాల మధ్య అభివృద్ధి పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.