Site icon HashtagU Telugu

Hydra : ‘హైడ్రా’ కు జై కొట్టిన బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Mp Konda Vishweshwar Reddy

Mp Konda Vishweshwar Reddy

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. హైడ్రా స్పీడ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇతర రాజకీయ నేతలు సైతం హైడ్రా దూకుడు పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే బీజేపీలోని కొంతమంది మాత్రం హైడ్రా పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ వంటి వారు వ్యతిరేకిస్తే, రఘునందన్ , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా కొండా (MP Konda Vishweshwar Reddy)..హైడ్రా ఫై స్పందించారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాంత మంది సమర్ధిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పుకొచ్చారు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అని అందువల్లే తాను బీజేపీలో ఉన్నా మద్దతు ఇస్తున్నానన్నారు. హైడ్రా కూల్చివేతల వేనుక ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలుత కూల్చేవారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిందన్నారు. ఇదే సందర్బంగా హైడ్రా కు కొన్ని సూచనలు తెలియజేసారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చేపట్టిన అక్రమ నిర్మాణాల నిందితులు ఎవరో గుర్తించాలి. స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటి శిథిలాల తొలగింపుకు అయ్యే ఖర్చును బిల్డర్ల నుంచే వసూలు చేయాలన్నారు. బాధితుల్లో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రానే చూపించాలన్నారు.

Read Also : MLC Kavitha : రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ పై విచారణ

Exit mobile version