Site icon HashtagU Telugu

CM KCR: సింగ‌రేణి కుంభ‌కోణం.. కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్న‌రా..?

Singa Reni Coal Scam

Singa Reni Coal Scam

తెలంగాణ‌లోని సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని క‌లిసిని కోమ‌టిరెడ్డి, సింగరేణిలో 50 వేల కోట్ల అవినీతి జరగబోతోందని, కోల్‌ ఇండియా మార్గదర్శకాలను పక్కనబెట్టి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మైనింగ్‌ టెండర్‌ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ప్రధాని మోదీకి తెలిపారు.

రాష్ట్రంలో జ‌రుగున్న అవినీతిపై ఆధారాలతో సహా ప్రధానికి వివరించానని, ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణపై దృష్టి పెడతామని చెప్పారని తెలిపారు. ఈ క్ర‌మంలో త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌ధాని అన్నార‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు. నమామీ గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరానని పేర్కొన్నారు. తెలంగాణపై దృష్టి పెడతామని చెప్పారని తెలిపారు. నమామీ గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరానని పేర్కొన్నారు.

హైదరాబాద్‌-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణంపై కూడా ప్రధానితో చర్చించానని, జీఎంఆర్‌ సంస్థ రహదారి నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్‌కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. త్వ‌ర‌లోనే ఈ రహదారి అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించనున్నట్లు చెప్పారు. కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి-మోత్కూరు రోడ్డును, నల్లగొండ-మల్లేపల్లి, భువనగిరి- చిట్యాల రోడ్లను జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరానని, ఈ క్ర‌మంలో తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని కోమ‌టిరెడ్డి తెలిపారు.

ఇక‌సింగరేణి సంస్థకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌ బొగ్గు గనులను ఓ ప్రైవేటు సంస్థకు కేటాయింపు వెనుక రాఫెల్‌ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని గ‌తంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష‌డు రేవంత్‌రెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నైనీ బ్లాక్‌ బొగ్గు గనులను 25 ఏళ్లకు గాను ఓ ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చారని, ఈ కేటాయింపులో కోల్‌ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపించారు. రాఫెల్‌ కుంభకోణం 35 వేల కోట్లు అయితే ఈ కుంభకోణం విలువ 50 వేల కోట్లు ఉంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాని మోదీకి ఆధారాల‌తో స‌హా పిర్యాదులు చేయ‌డం చూస్తుంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.