తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ జిల్లా రైతులకు నష్టం కలిగించే 246జీవోను వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ, పాలమూరు జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 246జీవోను రద్దు చేయకుంటే దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ జీవో రద్దు చేయాలని కోరుతూ అవసరం అయితే ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు. SLBCకి కేటాయించిన నీటి రద్దు చేస్తూ సర్కార్ జీవో తెచ్చిందన్నారు. SLBCకి 45టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీసుకువచ్చిన జీవో 246ను రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: Liger in Asia Cup: భారత్ , పాక్ మ్యాచ్ లో లైగర్
ఈ జీవోను రద్దు చేయనట్లయితే…దీక్షచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై నీటిపారుదల ఇంజనీర్లతో తాను చర్చించనున్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ పూర్తి వెనకబడిందన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లాకు తీవ్ర నష్టం చేసే ఈ నిర్ణయాన్ని కేసీఆర్ వెంటనే మార్చుకోవాలని కోరారు.