Site icon HashtagU Telugu

Telugu Federation Conference : తెలుగు మహాసభల పై ఎంపీ చామల ఆగ్రహం

Mp Kiran Kumar Reddy

Mp Kiran Kumar Reddy

అంత అనుకున్నదే జరుగుతుంది..మొన్నటికి మొన్న అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు (CM Revanth Reddy Name)ను మరచిపోయారనే ఆయన్ను అరెస్ట్ చేసారని బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ మాత్రం ఆలా ఏమి కాదని , చట్టప్రకారమే అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు.కానీ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో(World Telugu Federation Conference) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సినీ నటుడు బాలాదిత్య (Baladitya) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సమయంలో, సీఎం రేవంత్‌కు ఆహ్వానం పలకాల్సిన సమయంలో “తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ గారు” అని పలికి వెంటనే తన పొరపాటును గ్రహించి తల పట్టుకున్నారు. తప్పు తెలుసుకున్న బాలాదిత్య తక్షణమే క్షమాపణలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి అసలైన పేరును సరిచేసి ప్రస్తావించారు. కానీ అప్పటికే సభలో ఉన్నవారు ఈ సంఘటనను ఆసక్తిగా చూసి చప్పట్లతో, హాస్యంతో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో కంపెనీ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్

ఈ ఘటన పైభువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అంటూ మండిపడ్డారు. తెలుగు మహాసభలు పెట్టిన వారికి బుద్ధి లేదా, అసలు ఆ సభలు పెట్టింది ఎవరంటూ ఫైరయ్యారు. ఎంపీగా ఉన్న నేనే పేపర్లలో రాసుకుని చదువుతున్నా.. ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఏ సీఎం వస్తున్నడో తెలియకుండా యాంకర్‌ చదువుతడా అని విమర్శించారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఎదో కుట్ర ఉందన్నారు.