బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10K, 5K, 3K రన్ ఫర్ పీస్ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామమని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధుల నుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు.
Run For Peace : బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్

Run For Peace Imresizer