CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం

గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

CM Revanth Reddy: గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మంగళవారం తెలిపారు. మిత్రుడిగా రేవంత్‌కి బీజేపీలో చేరేందుకు సహకరిస్తానని చెప్పారు. రేవంత్‌ని పార్టీలో చేర్చుకోవాలని తాను సిఫార్సు మాత్రమే చేస్తానని, అయితే ఆయనను బీజేపీలో చేర్చాలా వద్దా అనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చూసుకుంటారని అన్నారు. నిజామాబాద్‌లో అరవింద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsAppClick to Join

రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ లీడర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడు బీజేపీలో ఉంటే బాగుంటుందని ఎంపీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధంగా ఉందని, రేవంత్ కాంగ్రెస్‌లో కొనసాగితే అసమర్ధుడు అవుతాడన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ పని చేయనివ్వరని అన్నారు. బీజేపీలో చేరికపై రేవంత్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, అనవసరంగా తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అరవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే రాజకీయం మొదలైందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతాయని అన్నారు.

Also Read: AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను హెచ్చరించిన ఈసీ..