Site icon HashtagU Telugu

Telangana : కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించిన ఎంపీ అర్వింద్‌

Mp Arvind Comments On Kcr

Mp Arvind Comments On Kcr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections ) సమయం దగ్గర పడుతున్న క్రమంలో బిజెపి ఎంపీ అర్వింద్‌ (MP Arvind )..బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (KCR) ఫై ప్రశంసలు కురిపించడం అందర్నీ ఆశ్చర్యపడేసింది. ఆరు నెలల క్రితం వరకు తెలంగాణ లో బిఆర్ఎస్ – బిజెపి (BRS vs BJP) ల మద్యే అసలైన పోటీ ఉంటుందని..ఈసారి బిజెపి పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని అంత భావించారు కానీ ..ఒక్కసారిగా అంత తారుమారైంది. కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచడమే కాదు ఇతర పార్టీల నేతలను రాబట్టుకోవడంలోనూ సక్సెస్ అయ్యింది. అలాగే ఎన్నికల హామీలు సైతం ప్రజలను బాగా ఆకట్టుకోవడంతో బిఆర్ఎస్ vs కాంగ్రెస్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

పలు సర్వేలు సైతం ఈ రెండు పార్టీల మద్యే అసలైన పోటీ ఉండబోతుందని తెలిపాయి. ఈ క్రమంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంపీ అర్వింద్‌ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్‌.. రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బీజేపీ ఎలాగూ గట్టి పోటీని ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి.. ఎంపీ అర్వింద్‌ అలాంటి వ్యాఖ్య చేసి ఉన్నాడు కావొచ్చు అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : BRS : తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి – కేసీఆర్