Site icon HashtagU Telugu

Motkupalli Narasimhulu: దళితులకు పార్లమెంట్ గేట్ తాకే హక్కు లేదా.? కాంగ్రెస్ కు మోత్కుపల్లి సవాల్

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu: కాంగ్రెస్ పార్టీ లోకసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లోకసభ అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం దళితులని అవమానించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తాడు.

కేసీఆర్ మాదిగలను చిన్న చూపు చూస్తున్నాడని, మాదిగలందరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని చెప్పారు మోత్కుపల్లి నర్సింహులు. నీతి, నిజయితీగా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తూ, ఇప్పటి వరకు ఎలాంటి పదవులు ఆశించలేదని అన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియమ్మ పై కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పేదల పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తొలిసారి ఆకాంక్షించాను. నా కోరిక నెరవేరి నా తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నేర వేరుస్తున్నాడని సీఎంని కొనియాడారు.

నాకు ఎమ్మెల్యే పదవి రాకున్నా నేను ఏనాడు బాధపడలేదు..కానీ తెలంగాణాలో మాదిగలను పక్కన బెట్టే పాపాన్ని ఎవరు మూటగాట్టుకోవాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. పార్లమెంట్ సీట్ల కేటాయింపు నిర్ణయాలు మాదిగ జాతికి చాలా అవమానంగా భవిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అడుగుతున్నా.. మాదిగల మద్దతు లేకుండా మనుగడ ఎలా సాగుతుందనుకుంటున్నారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో గెలవాలని కోరుకుంటున్నామని, అలాంటి మాదిగలను పక్కన బెట్టాలనుకునే వారు ఎవరు అని మంత్రులను, ఎమ్మెల్యే లను ప్రశ్నించారు. పదవి ఉన్న లేకున్నా కాంగ్రెస్ పార్టీలో పడి ఉందాం అనుకున్న కానీ నా కులానికి జరుగుతున్న అన్యాయం నన్ను కలచివేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ మాదిగలకు మోసం చేసి కూడా నాగర్ కర్నూల్ స్థానాన్ని మాదిగలకు కేటాయించాడు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పార్లమెంట్ స్థానం కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని, రేవంత్ రెడ్డికి ఒక అన్నగా తోడుండాలని కొరకునే వ్యక్తిని నేను. కానీ మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడం చరిత్రత్మాకమైన తప్పు అని అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp : Click to Join

పార్టీ కోసం మాదిగల కోసం జరిగిన తప్పును సరిదిద్దుకోవలసిన అవసరం నాపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ అతనిని కలిసే అవకాశం దొరకడం లేదని చెప్పారు. ఇప్పటికైనా జరిగిన తప్పును తిరిగి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది..మాదిగలను ఆదరించాలని, అయితే మాకు వేరే కులాల మీద ఎలాంటి కోపం లేదు.. మా కులాన్ని అణచివేయ్యొద్దని స్పష్టం చేశారు మోత్కుపల్లి నర్సింహులు. పార్లమెంట్ ఎన్నికలకు ఒక కుటుంబంలో రెండు మూడు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి.. 80 లక్షల మంది ఉన్న మాదిగ కులానికి న్యాయం చెయ్యండి అంటూ ఆవేదన చెందారు. మాదిగలను పార్లమెంట్ లో కూర్చునే హక్కును తీసేసే ప్రయత్నం జరుగుతుంది. మాదిగలకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని రక్షించుకుందామని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను అంటూ మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

Also Read: BJP: ఎన్నికల ప్రచారంలో మహిళ చెంపపై ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి