Motkupalli Deeksha : కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా మోత్కుపల్లి దీక్ష..?

కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Motkupalli Narasimhulu Deek

Motkupalli Narasimhulu Deek

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu )..కాంగ్రెస్ పార్టీ (Congress) తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. లోక్ సభ ఎన్నికల టికెట్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగ లకు తీరని అన్యాయం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇతర కులాలవారికి టికెట్స్ ఇచ్చిన కాంగ్రెస్ ..మాదిగ లకు మాత్రం టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మాదిగ లను పార్టీలో అంటరాని వారీగా చూస్తున్నారని.. బీజేపీ, బిఆర్ఎస్ రెండేసి టికెట్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అటెండర్ పోస్టులు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా .. ఎప్పుడు మాదిగలకు అన్యాయం జరగలేదని , ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం మాదిగలకు అన్యాయం చేసారని వాపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వ్యక్తి ని తానని.. కానీ ఈరోజు తన మాటకు రెస్పెక్ట్ లేదు .. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. పార్టీలో జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ దే బాధ్యతని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తేరుకొకపోతే..పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. రేపు ఇదే అంశం పై ఒక్క రోజు దీక్ష చేస్తున్నానని మోత్కుపల్లి ప్రకటించారు. ఇక మోత్కుపల్లి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మోత్కుపల్లి కాంగ్రెస్ నేతే కాదు. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కర్ణాటక వెళ్లి.. డీకే శివకుమార్ తో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో అయినా తనకు సీటు గురించి ఆలోచిస్తారేమోనని మోత్కుపల్లి నరసింహులు ఆశించారు. కానీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. కడియం శ్రీహరిని చేర్చుకుని ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వడంతో దానిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని వారంతా అంటున్నారు.

Read Also : Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ ఇండియాలో అతిపెద్ద స్కామ్ : రాహుల్ గాంధీ 

  Last Updated: 17 Apr 2024, 06:06 PM IST