Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు

మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజు ఒకరు చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డీఐజీ ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - December 13, 2021 / 04:43 PM IST

మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజు ఒకరు చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డీఐజీ ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్, రోడ్డు ప్రమాదాల వీడియోలను చూపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మోతాదులో మద్యం సేవిస్తే శిక్ష సైతం ఎక్కువగానే ఉంటుందని, ప్రమాదాలకు కారణమవుతున్న విషయాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కౌన్సిలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్యను క్రమంగా తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో రోజుకు ఒక వ్యక్తి చనిపోతున్నాడని, అలాగే రోజుకు ఇద్దరు రోడ్డు ప్రమాదాల వల్ల పూర్తిగా అంగవైకల్యానికి గురవుతున్నారని, దీని కారణంగా రోజుకు మూడు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించడం తప్పు కాదని, అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని చెప్పారు. మద్యం సేవింవి వాహనాలు నడపడం వల్ల చిన్న, చిన్న తప్పులకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు.

అనంతరం మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితులలో నడపమని, హెల్మెట్, బెల్ట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న తప్పుల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు సురేష్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సిఐలు చీర్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బాలగోపాల్ పాల్గొన్నారు.