తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఇండియాలోనే బెస్ట్ నగరంగా పేరు తెచ్చుకుంది. గచ్చిబౌళిలో కేబుల్ బ్రడ్జి, ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ బల్బులు లాంటి సౌకర్యాలతో హైదరాబాద్ మరింత డెవలప్ మెంట్ అవుతోంది. ఇవేకాకుండా శిల్పరామం, సాలార్ జంగ్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గొల్కోండ కోట లాంటివన్నీ హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తున్నాయి. మెట్రో ట్రైన్ తో పాటు ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో బెస్ట్ లివింగ్ సిటీగానూ హైదరాబాద్ కు పేరుంది. కేవలం సిటీని చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం క్యూ కడుతారంటే.. భాగ్యనగరం ఎంతగాను ఆకట్టుకుంటుందో ఇట్టె తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిగలో మరో అద్భుతం ఆవిష్కరణ కానుంది. అదే ఫ్లోటింగ్ బ్రడ్జి
పీవీఎన్‌ఆర్ మార్గ్ వద్ద హుస్సేన్ సాగర్‌లోకి వెళ్లే వంతెన ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. రష్యాలోని మాస్కోలో ఉన్న తరహాలో V ఆకారపు వంతెన మనకు కూడా ఉంటే బాగుంటుంది అని హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.. అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సూచించడంతో.. ఆయన ఆన్సర్ చేస్తూ.. PVNR మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద కూడా అలాంటిదే రాబోతోందని చెప్పారు. అయితే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కు పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది.
A surprise, well something similar, is on its way at the PVNR marg, jutting into the Hussain Sagar, will be up and running before the end of this year https://t.co/yoju5WOPzI pic.twitter.com/sPluPaIuqq
— Arvind Kumar (@arvindkumar_ias) January 21, 2022