Site icon HashtagU Telugu

Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..

General Ticket Rule

General Ticket Rule

Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  తెలంగాణలోనూ పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీని రైల్వేశాఖ కల్పించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లను కేటాయించారు. వీటిలో అత్యధికంగా 9 స్టేషన్లు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. ప్రధానంగా తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (17405/17406) మేడ్చల్‌లో.. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12787, 12788) ట్రైన్  మహబూబాబాద్‌లో ఇకపై ఆగుతాయి. తనతో పాటూ స్థానికుల రిక్వెస్ట్ మేరకు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. పొరుగునే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించనుంది. భువనేశ్వర్‌లో బయలుదేరే ఈ రైలు.. పూరి, కటక్, బ్రహ్మపూర్ మీదుగా విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరో వందేభారత్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమే.

Also Read :Tandoori Egg Recipe: తందూరి కోడిగుడ్డు రెసిపీ.. ఇంట్లోనే సింపుల్గా చేసుకోండిలా?