Site icon HashtagU Telugu

Alert : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!!

Monkey Pox

Monkey Pox

యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇంద్రానగర్ కాలనీకిచెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈనెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండటంతో అతడ్ని వైద్యులు ఈనెల 20 నుంచి అబ్జర్వేషన్లో ఉంచారు. తాజాగా అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు.