Monkey Catch : అతి త్వరలోనే తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని గ్రామాల ప్రజలు కొత్త సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. సర్పంచ్ కాబోయే వారి నుంచి ప్రజలు చాలానే ఆశిస్తారు. స్థానికంగా వివిధ రకాల డెవలప్‌మెంట్ పనులు చేయించుకోవాలని భావిస్తారు. సంక్షేమ పథకాల్లో తమకు ఛాన్స్ ఇప్పించే వాళ్లు సర్పంచ్ అయితే బాగుంటుందని అనుకుంటారు. అయితే పలు గ్రామాల్లో మాత్రం కోతులే పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ సమస్యను తీర్చగలిగే నేతకు జై కొట్టేందుకు జనం రెడీగా ఉన్నారు. గ్రామసీమ నుంచి వానరాలను తరిమికొట్టే వీర సర్పంచ్‌లను ఎన్నో గ్రామాలు కోరుకుంటున్నాయి. ఊరిలో కోతుల బెడదను తొలగించడానికి కొంతైన వర్క్ చేసిన వాళ్లకు సర్పంచ్‌గా ప్రయారిటీ ఇవ్వాలని పలు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న అభ్యర్థులు తొలుత కోతుల(Monkey Catch) సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు.
Also Read :WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్
ఒక నిదర్శనం ఇదిగో..
2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ప్రమీల సర్పంచ్‌గా గెలిచింది. ఆమె ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ భార్య. దూడల సంపత్ రోజుకో వేషం వేసుకొని మరీ కోతులను గ్రామం నుంచి తరిమేశాడు. అందరి సహకారంతో రూ.లక్ష వరకు విరాళాలను సేకరించి ఏపీ నుంచి కోతులు పట్టే వాళ్లను పిలిపించి కోతులను పట్టి అడవుల్లో వదిలించాడు. దాంతో ఆ ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీలకే గ్రామస్తులు సర్పంచ్‌గా పట్టం కట్టారు.
Also Read :Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !
35 లక్షల కోతులు
తెలంగాణలో 35లక్షలకుపైగా కోతులు ఉన్నాయి. ఇవి వివిధ గ్రామాల్లో స్థానికులపై దాడులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వానరాల బెడద ఎక్కువ. రైతుల పంటలను కూడా కోతులు ఆగం చేస్తున్నాయి.
ఏకగ్రీవం కోసం అగ్రిమెంట్
గతంలో వరంగల్ జిల్లాలోని దరావత్ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. బొడ్రాయి పండగ రోజు ఖర్చుల కోసం ప్రతి ఇంటికి రూ.1000 చొప్పున పంచుతానని చెప్పాడు. ఇందుకు ఎవరూ నామినేషన్ వేయకుండా ఉండేలా అగ్రిమెంట్‌ను రాసుకున్నారు.