Site icon HashtagU Telugu

Mohan Babu : చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది – మోహన్ బాబు

Mohan Babu Cng

Mohan Babu Cng

చిత్రసీమలో మోహన్ బాబు (Mohan Babu) అంటే చాలామంది భయపడతారు..దీనికి కారణం ఆయన ముక్కుసూటిగా మాట్లాడే స్వభావమే. తనకన్నా పెద్దవారైనా , చిన్నవారైనా సరే తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటారు. లోపలొకటి పెట్టుకొని , బయటొకటి మాట్లాడడం ఆయనకు తెలియదు..ఏమాట్లాడాలనిపిస్తే..అదే మాట్లాడుతుంటారు. అందుకే చాల సందర్భాలలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదాల్లో నెట్టిసాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా మోహన్ బాబు ఫిల్మ్ నగర్ టెంపుల్ ఛైర్మన్‌ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ (Ram Mandir Temple) సందర్భంగా ఫిల్మ్ నగర్ టెంపుల్ (Film Nagar Temple) లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరి 14 నుండి 22 వరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియా తో మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అలా కట్టినదేనని, చిత్రపురి కాలనీని అలానే వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ టెంపుల్ లో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములున్నారని.. ఈ దైవ సన్నిధానంలో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని ఎంతోమది చెప్పారని.. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీనరసింహస్వామి.. ఇలా 18 మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని.. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే అయోధ్య రామమందిర ఆహ్వానం అందిందని..కాకపోతే కొన్ని కారణాలతో వెళ్లలేకపోతున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Read Also : Hyderabad: బంజారాహిల్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. మూడు కార్లు దగ్ధం