Hyderabad: గెలిస్తే జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యను తీరుస్తా: అజహరుద్దీన్

తెలంగాణాలో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ స్థానం నుంచి తనను పోటీకి దింపినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Hyderabad: తెలంగాణాలో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ స్థానం నుంచి తనను పోటీకి దింపినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.మల్లికార్జున్ ఖర్గే జీ, రాహుల్ జీ, సోనియా మేడమ్, ప్రియాంక గాంధీ మేడమ్‌లతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ హైకమాండ్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అజహరుద్దీన్ చెప్పాడు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ సమస్యపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఓపెన్ డ్రైనేజీ వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడడమే కాకుండా అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భారత్‌కు విజయావకాశాల గురించి అడిగిన ప్రశ్నకు అజహరుద్దీన్‌ మాట్లాడుతూ.. టోర్నీలో భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు.

అజహరుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టు తరుపున 99 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2009లో మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునికి పోటీ చేస్తున్నారు.

Also Read: Bank Holidays: నవంబర్‌ నెలలో బ్యాంక్ సెలవులివే.. పూర్తి లిస్ట్ ఇదే..!