HCU : కంచ గచ్చిబౌలి భూములపై మోదీ సంచలన వ్యాఖ్యలు

HCU : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందని విమర్శించారు

Published By: HashtagU Telugu Desk
Modi Hcu

Modi Hcu

హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూముల (HCU) వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తుండగా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగానే మోదీ, కాంగ్రెస్ పాలన విఫలమైందని పేర్కొన్నారు.

Balanagar Road Accident : ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ కు యువకుడు బలి

ప్రధానమంత్రి మోదీ వక్ఫ్ చట్టం సవరణపై కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. వక్ఫ్ రూల్స్‌ (Waqf Rules)ను కాంగ్రెస్ (Congress) తమ రాజకీయ స్వార్థానికి మార్చుకుందని విమర్శించారు. “ఓటు బ్యాంకు వైరస్” పేరిట కాంగ్రెస్ సమాజాన్ని విభజించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. మోదీ హరియాణాలోని హిసార్ విమానాశ్రయంలో పాల్గొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ, కొత్త వక్ఫ్ చట్టం ద్వారా ముస్లీం మహిళలు, వితంతువులు, పిల్లలు, పస్మాండ ముస్లీంలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

మోదీ వ్యాఖ్యల ప్రకారం, వక్ఫ్ ఆస్తులు లక్షల హెక్టార్ల భూమిని కలిగి ఉన్నప్పటికీ, అవి పేదలకు కాకుండా భూ మాఫియా చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. పేద ముస్లీంల హక్కులను కాపాడేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలయ్యేతో పేదలకు రక్షణ లభిస్తుందని, వారి భూములను ఎవ్వరూ కబళించలేరని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, భూవివాదాలపై ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.

  Last Updated: 14 Apr 2025, 04:03 PM IST