Site icon HashtagU Telugu

PM Modi: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. బీజేపీ ముఖ్యనేతలతో చర్చ..!

Modi Tour

Pm Modi Flight

నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మరుసటి రోజు (శనివారం) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయం వెలుపల దాదాపు 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, పార్టీ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణతో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం పలకనున్నారు. శనివారం రామగుండంలోని పునరుద్దరించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ప్రారంభోత్సవానికి ప్రధాని రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో వివిధ శాఖల అధికారులతో మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.

ప్ర‌ధాన మంత్రి త‌న ప‌ర్య‌ట‌న‌లో ఆర్‌ఎఫ్‌సిఎల్‌ని జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రామగుండం, హైదరాబాద్‌లో తగిన భద్రత, శాంతిభద్రతలు, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం ఫర్టిలైజర్స్ సీఈవో ఎ.కె.తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, కార్యదర్శి జీఏడీ శేషాద్రి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే. శ్రీనివాస రాజు, అగ్నిమాపక శాఖ డీజీ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

అయితే.. ప్రధాని మోదీ నేడు విశాఖకు రానున్నారు. సాయంత్రం 7 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. వారికి సీఎం జగన్ ఘన స్వాగతం పలకనున్నారు. రాత్రి 8 గంటలకు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్‌తో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జనసేన పొత్తుపై కూడా వారిద్దరు చర్చించనున్నట్లు సమాచారం.

 

Exit mobile version