Site icon HashtagU Telugu

Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్‌

karnataka 2023

Bjp Pm Modi

ఏపీ ప‌ర్య‌ట‌న ముగించుకుని నవంబర్ 12న బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ కానున్నాఉ. విమానాశ్రయం వెలుపల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌, పార్టీ ఉపాధ్యక్షుడు డి. కె. అరుణ‌ తో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం పలుకుతారు.

నవంబరు 12న రామగుండంలోని పునరుద్దరించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్రారంభోత్సవానికి ప్రధాని రానున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ‌ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిఆర్‌కెఆర్ భవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ని జాతికి అంకితం
ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రామ‌గుండ‌, హైద‌రాబాద్ ప్రాంతాల్లో బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం ఫర్టిలైజర్స్ సీఈవో ఎ. కె. తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ స‌మావేశానికి డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, కార్యదర్శి జీఏడీ శేషాద్రి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే. సమీక్షా సమావేశానికి అగ్నిమాపక శాఖ డీజీ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు హాజరయ్యారు.