Site icon HashtagU Telugu

Modi at Kamareddy : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారు – మోడీ

Modi Kmr

Modi Kmr

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign) చివరికి చేరుకోవడం తో తమ అభ్యర్థులను గెలిపేంచేందుకు జాతీయ నేతలు రంగంలోకి దిగారు. బిజెపి నుండి ప్రధాని మోడీ , అమిత్ షా , నడ్డా తదితరులు రంగంలోకి దిగగా..ఇటు కాంగ్రెస్ నేతలు రాహుల్ (Rahul) , ప్రియాంక , శివకుమర్ తదితరులు ప్రచారం చేస్తున్నారు.

ఈరోజు ప్రధాని మోడీ (Modi) కామారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని , ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని, తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్‌ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని మోడీ ఆరోపించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది. పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని , తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు పసుపు బోర్డు సహా పలు హామీలు ఇచ్చామని, వాటిని నిలబెట్టుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో హామీలు అమలు చేయడంలో బీజేపీకి తిరుగులేని రికార్డు ఉందని ప్రధాని మోడీ తెలిపారు.కేంద్రంలో ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, రైతులకు గిట్టుబాటు ధరలు, అయోధ్య రామాలయ నిర్మాణం సహా కేంద్రం నెరవేర్చిన పలు హామీల్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ ఓటర్లకు గుర్తుచేసారు. తెలంగాణలో అధికారమిస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే బీసీ వర్గాల నుంచి ప్రధాని, కేంద్రమంత్రుల సహా పలు పదవుల్ని బీజేపీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Read Also : Rahul Gandhi: నిజామాబాద్‌ లో పోస్టర్ల కలకలం, రాహుల్ రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు

 

Exit mobile version