టీఆరెస్ నేత, ఎమ్మెల్సీ కవిత… ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తమకు ప్రమాదం తప్పదని గ్రహించిన బీజేపీ….అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ శనివారం నిర్వహించిన బిగ్ డిబేట్ కవిత పాల్గొన్నారు.. లిక్కర్ కుంభకోణంలో బీజేపీ తన పేరును లాగడంపై ఆమె స్పందించారు. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని…కేసీఆర్ వాళ్లకు అసలు టార్గెట్ అన్నారు. లిక్కర్ స్కాంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవద్దని…తన కుటుంబ సభ్యులకు…తన తండ్రికి చెప్పానని కవిత అన్నారు. అవసరమైనప్పుడు ఈ విషయం గురించి కేసీఆర్, కేటీఆర్ స్పందిస్తారని చెప్పుకొచ్చారు కవిత.
కేసీఆర్ ను చూస్తే మోదీకి టెన్షన్…అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత….దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని సవాల్ చేశారు. ఇదంత బీజేపీకి కొత్త కాదని…తమకు నచ్చని పార్టీలపై ఇలాగే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవే ఆరోపణలన్నారు.
Source:Abn News Channel