Modi speech : కేసీఆర్ కుటుంబానికి ప్ర‌ధాని మోడీ వార్నింగ్

అవినీతి, కుటుంబ పాల‌న వేర్వేరుగా ఉండ‌వ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర

  • Written By:
  • Updated On - April 8, 2023 / 03:34 PM IST

అవినీతి, కుటుంబ పాల‌న వేర్వేరుగా ఉండ‌వ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(Modi speech) టార్గెట్ చేశారు. కేంద్రం ఇస్తోన్న ప‌థ‌కాల‌ను కుటుంబం(Kcr Family) పంచుకుంటుంద‌ని ఆరోపించారు. కేంద్రంతో క‌లిసి న‌డ‌వ‌కుండా తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ ఫ్యామిలీ అడ్టుకుంటోంద‌ని మోడీ దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి ప్రాజెక్టులోనూ కుటుంబం పంచుకుంటోంద‌ని ఆరోపించారు. వ్య‌వ‌స్థ‌ల‌ను అడ్టుపెట్టుకుని అవినీతికి పాల్ప‌డుతుంద‌ని కేసీఆర్ కుటుంబంపై ప‌రోక్షంగా మోడీ మండిప‌డ్డారు.

 కేసీఆర్ కుటుంబాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టార్గెట్ (Modi speech) 

కుటుంబ పాల‌న వ్య‌వ‌స్థ‌ల‌ను కంట్రోల్ చేస్తుంద‌ని మోడీ(Modi speech) అభిప్రాయ‌ప‌డ్డారు. అవినీతిప‌రులంద‌రూ ఒక‌ట‌య్యార‌ని అన్నారు. విచార‌ణ సంస్థ‌ల‌ను బెదిరిస్తున్నార‌ని చెప్పారు. త‌న‌పై పోరాడేందుకు దుష్ట‌శ‌క్తుల‌న్నీ ఒక‌టయ్యాయ‌ని వెల్ల‌డించారు. అవినీతిప‌రుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కేంద్రం అభివృద్ధి దిశ‌గా వెళుతుంటే, కుటుంబ పాల‌న(Kcr Family) స్వార్థం చూసుకుంటుంద‌ని ధ్వ‌జమెత్తారు. అవినీతిప‌రులకు వ్య‌తిరేకంగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మోడీ పిలుపునిచ్చారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను కుటుంబ పాల‌న ప‌నిచేయ‌నీయ‌డంలేద‌ని

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డానికి ఎన్డీయే ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మోడీ అన్నారు. కుటుంబ పాల‌న నుంచి తెలంగాణ విముక్తి కావాల‌ని పిలుపునిచ్చారు. అవినీతిప‌రుల‌ను ప్రార‌దోలాల‌ని కోరారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల నుంచి తెలంగాణ ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డాల‌ని కోరారు. వ్య‌వ‌స్థ‌ల‌ను కుటుంబ పాల‌న ప‌నిచేయ‌నీయ‌డంలేద‌ని ఆరోపించారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బెదిరిస్తున్నార‌ని మోడీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి

హైద‌రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ త‌రువాత‌ పరేడ్ గ్రౌండ్స్ వేదిక‌గా ఏర్పాటు చేసిన‌ భారీ బహిరంగసభలో (Modi speech)క్లుప్తంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, నిధుల గురించి మోడీ వివ‌రించారు. తెలంగాణ, ఏపీలను కలుపుతూ సికింద్రాబాద్ – తిరుపతిని కలుపుతూ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు. భాగ్యలక్ష్మి నగరాన్ని ( హైదరాబాద్) తిరుప‌తి వేంకటేశ్వరస్వామి నగరంతో కల‌ప‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు.

Also Read : PM Modi: ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. 16 ఏళ్ల బాలుడు అరెస్ట్

తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామని మోదీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామి అయ్యేలా చూశామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో రైల్వే డబ్లింగ్ లు, విద్యుదీకరణ పనులను పూర్తి చేశామని చెప్పారు. జాతీయ రహదారులను పూర్తి చేశామని వివ‌రించారు. గత 9 ఏళ్లలో 70 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్ ను నిర్మించామని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయడం తనకు లభించిన అదృష్టమని అన్నారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని తెలిపారు. ఆయ‌న ప్ర‌సంగంలోని మొద‌టి భాగం అంతా తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి ప్ర‌స్తావించారు. రెండో భాగాన్ని క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని(Kcr Family) టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తున్న‌ప్ప‌టికీ అవినీతిప‌రుల‌ను వ‌ద‌ల‌మ‌ని (Modi speech) హెచ్చ‌రించారు.

Also Read : ‘Parivar welcomes you Modi Ji’ : ప్రధాని పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం