PM Narendra Modi Nizamabad Tour : ప్రధాని మోడీ (PM Modi) పూర్తి ఫోకస్ తెలంగాణ ఫై పెట్టినట్లు తెలుస్తుంది. మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ లో ఎలాగైనా ఈసారి గెలవాలని మోడీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తెలంగాణ కు వరాల జల్లు కురిపించడమే కాదు వరుస పర్యటన లు చేస్తున్నారు. ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించి పసుపు బోర్డు (Turmeric board) ప్రకటన చేసి రైతుల్లో సంతోషం నింపారు. ఈ ప్రకటన తర్వాత మోడీ కి ఎక్కడ చూసిన రైతులు జై జైలు పలుకుతున్నారు. ఇదే క్రమంలో ఇందూర్ లో ప్రజా ఆశీర్వాద సభను మోడీ కృతజ్ఞత సభగా మార్చారు.
ఇందుకోసం రేపు ప్రధాని నిజామాబాద్ కు రాబోతున్నారు. మోడీ నిజామాబాద్ టూర్ (Nizamabad Tour)కు ముందే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పసుపు బోర్డు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సభలో తెలంగాణకు మరిన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్ వేదికగా 8 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాని మధ్యాహ్నం 2:10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 2:55 గంటలకు బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కు చేరుకుంటారు మోదీ. 3:00 నుంచి 3:35 వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3:45 నుంచి 4:45 వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. తర్వాత 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి 5:45 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని.
Read Also : Telangana : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదు – రేవంత్ రెడ్డి