Site icon HashtagU Telugu

PM Modi : ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఏంచెపుతాడో…!!

Modi Ntv

Modi Ntv

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా మే 13 న నాల్గొవ దశ పోలింగ్ జరగబోతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ (Telangana) లో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఏపీ(AP)లో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎవరికీ వారు గెలుపు ధీమాతో ఉన్నారు. రేపటితో ప్రచారానికి తెరపడనుంది. రెండు నెలలుగా మోతమోగించిన మైకులు , సోషల్ మీడియా వేదికలు రేపు సాయంత్రం తర్వాత సైలెంట్ కానున్నాయి. సో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని గట్టిగా వాడుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులు , అధినేతలు చూస్తున్నారు.

మొన్నటి వరకు రోడ్ షోస్, సభలు , సమావేశాల్లో పాల్గొన్న పార్టీల అధినేతలు..ఇప్పుడు సాటిలైట్ చానెల్స్ లలో ఇంటర్వూస్ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పలు చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా..ఇప్పుడు దేశ ప్రధాని మొదటి సారి తెలుగు మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా మోడీ ఓ తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున NTV ప్రశ్నించనుంది. మరి ఆ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో..ఏ ఏ ప్రశ్నలు అడుగుతుందో..వాటికీ మోడీ ఎలాంటి సమాదానాలు చెపుతారో చూడాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇటు తెలంగాణ లో ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ..వాటిని నెరవేర్చలేదని కాంగ్రెస్ , బిఆర్ఎస్ ఆరోపిస్తుంది..అటు ఏపీలో కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. మరి వాటికీ ఏమైనా సమాధానము చెపుతారా..? లేదా అనేది చూడాలి.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి:

Read Also : Land Titling Act : కూటమిని గెలిపించబోయేది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్‌నా’..?

Exit mobile version