Site icon HashtagU Telugu

HCU : అలా మాట్లాడడం కాదు మోడీ..దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి – కేటీఆర్

Revanth Reddy, police are working like a private gang: KTR

Revanth Reddy, police are working like a private gang: KTR

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఆర్ఆర్ ట్యాక్స్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ హెచ్‌సీయూలో ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించడం సరైనదుకాదని, దమ్ముంటే సీబీఐ, సీవీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మోదీ సీరియస్ అయితే ఎందుకు కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ప్రశ్నించారు.

Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక

కేటీఆర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని, జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సూచించారు. HCUలో బుల్డోజర్ల పంపకానికి సంబంధించిన వ్యవహారంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక తమ వాదనను సమర్థించిందని, విద్యార్థులు మరియు పర్యావరణ ప్రేమికుల విజయం ఇది అని అన్నారు.

ఈ సందర్భంలో పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, ట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా దీనిలో భాగమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని, త్వరలో ఢిల్లీ వెళ్లి విచారణ సంస్థలను కలవనున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నోరు మెదపకపోవడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమే పడగొడతామన్న అభిప్రాయం లేదని, ప్రజలే ఆ పని చేస్తారని స్పష్టం చేశారు.