Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ

  • Written By:
  • Updated On - March 5, 2024 / 12:51 PM IST

దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ లో ప్రధాని మోడీ (PM Modi ) పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని.. నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

అనంతరం అక్కడే నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ (PM Modi At BJP Vijaya Sankalp Sabha)లో పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే మొదటి సివిల్‌ ఏవియేషన్‌ రీసర్చ్‌ కేంద్రాన్ని బేగంపేటలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌, తెలంగాణకు గుర్తింపు వస్తుందని అన్నారు. ఏవియేషన్‌ కేంద్రం స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని వివరించారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ’ అని తెలిపి జోష్ నింపారు. ‘మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను. ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏది చెబుతాడో అదే చేసి చూపుతాడు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారింది. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారు’ అని వివరించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని ప్రధాని అన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకమని చెప్పారు. మౌలిక సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. దీనిద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుందని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

విపక్షాల పాలనలో కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగు పడలేదని మోడీ విమర్శించారు. ‘కుటుంబ వాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. దోచుకోవడానికి కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ ఉందా? వారికి ఫ్యామిలీ ఫస్ట్.. మోదీకి నేషన్ ఫస్ట్. ఆ నేతలు ఎంతో మంది యువతను ఎదగనివ్వలేదు’ అని ప్రధాని మండిపడ్డారు.

అంతకు ముందు ప్రధాని మోడీ ..సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షణ చేసిన మోడీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని అందించారు. మహంకాళి ఆలయం నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు బలయల్దేరారు.

Read Also : Margani Bharat : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్