Site icon HashtagU Telugu

Modi Tweet: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా మారబోతోంది.. మోడీ ట్వీట్ వైరల్!

Modi

Modi

రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రేపు శంకుస్థాపన చేయబోతున్నారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ పనులు పూర్తయ్యాక రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందో తెలిపేలా డీడీ న్యూస్ ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటోలను నరేంద్రమోదీ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేషప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుంది’’ అంటూ మోడీ మరో ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) రేపు హైదరాబాద్ రానున్నారు. కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 8న ఉదయం 11:30 గం. లకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11:45 ని. ల నుంచి 12:05 ని. ల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 12:15 ని. ల నుంచి 1:20 ని. ల వరకు పరేడ్ గ్రౌండ్ జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 12:50 ని. ల నుంచి 1:20 ని. ల వరకు ప్రజనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం 1.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు.

Also Read: Karnataka Politics: బీజేపీతో ‘కిచ్చా’.. కర్ణాటకలో పొలిటికల్ ప్రకంపనలు!

Exit mobile version