Site icon HashtagU Telugu

Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

Heavy Rain Start In Hyderabad

Heavy Rain Start In Hyderabad

ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 27 వరకు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD)  అంచనా వేస్తోంది. ఇవాళ అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, యానాం, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 5 రోజులూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. 26, 27 తేదీల్లో కూడా దేశవ్యాప్తంగా వానలు కురిసే (Rain Alert) ఛాన్స్ ఉందని IMD అంటోంది.