Site icon HashtagU Telugu

MMTS Special Trains : హైదరాబాద్లో నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ సర్వీస్ లు..

MMTS Trains

MMTS Trains

హైదరాబాద్ నగరవాసులకు , అలాగే గణేష్ భక్తులకు తీపి కబురు తెలిపింది ఎంఎంటీఎస్ (HYD MMTS). 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4:40 గంటల వరకు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28 నగరంలో గణేష్ నిమజ్జనాలు (Hyderabad Ganesh Nimajjanam) కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ తో పాటు మెట్రో , ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీస్ లు నడపబోతున్నారు. ఇప్పటీకే మెట్రో అదనపు సర్వీస్ లు నడపబోతున్నట్లు తెలుపగా..తాజాగా ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులను (MMTS Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది.

ఆ డీటెయిల్స్ చూస్తే..

Train No.GSH-5: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28న రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GSH-1: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28వ తేదీ రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. మరుసటి రోజు 00:20 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

Train No.GLF-6: లింగంపల్లి-ఫలక్ నూమా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ఈ నెల 29న ఉదయం 12.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. 01:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GHL-2: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ఉదయం 12:30 గంటలకు బయలుదేరి.. 01:20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.

Train No.GLH-3: లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న ఉదయం 01:50 గంటలకు బయలుదేరి.. 02:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GFS-7: ఫలక్ నూమా-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న 02:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GHS-4: హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిన మధ్య రైల్వే. ఈ స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్ 03:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

Train No.GSH-8: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 04:00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. 4:40 గంటలకు హైదరాబాద్ కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Read Also : AP : జైల్లో దోమలు కుట్టక..రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా? – చంద్రబాబు ఫై నాని సెటైర్లు