Teenmar Mallanna : సీఎం సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఖమ్మం వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Published By: HashtagU Telugu Desk
Mlc Theenmar Mallanna Donat

Mlc Theenmar Mallanna Donat

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చిన తన వంతు సాయం అందిస్తుంటారు. అధికారంలో లేనప్పుడు కూడా పలు సందర్భాల్లో సీఎం సహాయ నిధికి ఆర్ధిక సాయం చేసిన మల్లన్న…ఇప్పుడు ఖమ్మం వరద బాధితుల సహాయార్ధం సీఎం సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ లో గత నాల్గు రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కొండపోత వర్షాలు పడడంతో జనజీవనం , రవాణావ్యవస్థ స్థంభించింది. ముఖ్యంగా ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం (Munneru Vagu Water Folw Raising) దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు ప్రకాశ్‌నగర్‌ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. దీంతో కవిరాజ్‌నగర్‌, వీడియోస్‌ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్‌ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల వరదలో అనేక మంది చిక్కుకున్నారు. పలువురి ప్రాణాలు సైతం కోల్పోయారు.

ఈ క్రమంలో సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ధైర్యం చెడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆస్తి, పంటనష్టం సాయం అందించాలని అధికారులను ఆదేశించాం. అత్యవసర నిధిగా కలెక్టర్ ఖాతాలో రూ. 5 కోట్లు కేటాయించాం. మీకు రాబోయే ఉపద్రవాన్ని ప్రభుత్వం ముందుగానే ఊహించింది’ అంటూ వారికి భరోసా ఇచ్చారు.

Read Also : Telangana Floods : తెలంగాణ వరదలు.. ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం!

  Last Updated: 03 Sep 2024, 11:54 AM IST