తెలంగాణ రాష్ట్రానికి చెందిన BRS MLC శంబీపూర్ రాజు (MLC Shambipur Raju ).. సచివాలయంలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం (Statue of Telangana Mother) విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం తెలంగాణ తల్లి (Telangana Talli Statue) కాకుండా సవతి తల్లి విగ్రహంగా రూపుదిద్దుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళా సమాజాన్ని అవమానించేలా, విగ్రహ రూపురేఖలు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలలో తల్లి విగ్రహాలను నగలు, కిరీటాలతో సువర్ణంగా రూపొందించినా, తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికం సూచించేలా రూపుదిద్దుకుంటున్నదని ప్రశ్నించారు. ఇది తెలంగాణ మహిళా సమాజానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తారు. ఈ విగ్రహ రూపకల్పనపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. “మేమే రూపొందించిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం” అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో ఉత్కంఠ, గౌరవం, మరియు రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్రతీక కావాలని ఆయన వ్యాఖ్యానించారు. శంబీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం హైదరాబాద్ నగర శివార్లలలో రేడి అవుతోంది. దీన్ని అత్యంత గోప్యంగా డిజైన్ చేపిస్తోంది..పెద్ద అంబర్ పేట గండి చేరువు దగ్గరలోని ఓ శిల్పి దీన్ని తయారు చేస్తున్నారు.. తెలంగాణ సచివాలయం ముందు దీని కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. డిసెంబర్ 9 న ఆవిష్కరించడానికి రేడి అవుతున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి సమాధానం చెపుతుందో చూడాలి.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది.. డిసెంబర్ 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి..డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ జన్మదినంతో పాటు ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసింది.
Read Also : QR Code E- Pan 2.0: కొత్త క్యూఆర్ కోడ్ ‘ఈ – పాన్ కార్డ్’ ఎలా పొందాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!