Kavitha : రాజ్య‌స‌భ‌కు క‌విత‌? ..మంత్రి ప‌ద‌వి అంద‌నిద్రాక్షే..!

తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి కావాల‌ని క‌విత ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆమె సన్నిహితుల చెప్పుకుంటోన్న మాట‌లు. కానీ, మారుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా క్యాబినెట్ లో స్థానం క‌ల్పించ‌డానికి కేసీఆర్ ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు.

  • Written By:
  • Updated On - November 22, 2021 / 05:22 PM IST

తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి కావాల‌ని క‌విత ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆమె సన్నిహితుల చెప్పుకుంటోన్న మాట‌లు. కానీ, మారుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా క్యాబినెట్ లో స్థానం క‌ల్పించ‌డానికి కేసీఆర్ ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే, ఇప్ప‌టికే హ‌రీశ్‌, కేటీఆర్ మంత్రులుగా ఉన్నారు. ఇక క‌విత‌కు కూడా మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తే, కుటుంబ క్యాబినెట్ గా ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేస్తారు. అందుకే, ఎమ్మెల్సీ లేదా రాజ్య‌స‌భ ప‌ద‌వి ఏది కావాలో..తేల్చుకోమ‌ని ఆమెకు కేసీఆర్ చెప్పాడ‌ట‌.చాలా కాలంగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు ప‌లువురు ఆ విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లో మీడియాకు చెప్పారు. ముహూర్తాల‌ను కూడా ఒక‌టి రెండుస్లారు అనుకున్నారు. కానీ, సాధ్యం కాలేదు. ఈసారి యాదాద్రి ఆల‌యం ప్రారంభం త‌రువాత మంచి ముహుర్తం చూసుకుని కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం చేస్తార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. ఒక వేళ అదే జ‌రిగితే, క‌విత‌కు మంత్రి ప‌ద‌వి క‌ష్ట‌మే.

Also Read : కేసీఆర్ నిర్ణయంపై సమంత, నాని, ప్రకాష్ రాజ్, రామ్ రియాక్షన్

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నిక కావడానికి మొగ్గు చూపుతుందా లేదా ఆమె రాజ్యసభకు వెళ్తారా? ఇది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఆదివారం ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ ఎన్నికలకు 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కేసీఆర్.. నిర్ణయం తీసుకోవాలని కవితకు చెప్పినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఏ లలితకు ‘బి’ ఫారం ఇచ్చారు కాబ‌ట్టి, క‌విత‌ రాజ్యసభకు వెళ్లేందుకే ఇష్టపడతారనే ఊహాగానాలు ఇంకా వినిపిస్తున్నాయి.ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్సీలకు రెండోసారి అవకాశం నిరాకరించగా, రంగారెడ్డి నుంచి శంభీపూర్‌ రాజు, పి మహేందర్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరిద్దరూ రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ పీ శ్రీనివాస్‌రెడ్డి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుకు నమ్మకస్తుడు.

Also Read : రేవంత్ కు పదవీ గండం?

నల్గొండ నుంచి టీ చిన్నప్ప రెడ్డి స్థానంలో ఎమ్‌సీ కోటిరెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ టీ భాను ప్రసాద్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. మరో ఎమ్మెల్సీ ఎన్‌.లక్ష్మణరావు స్థానంలో ఇటీవల టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌.రమణ ఎంపికయ్యారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కె.శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉంటారని, సాయిచంద్‌కు మద్దతు ఇవ్వాలని మరో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని కోరారు. మెదక్‌ ఎల్‌ఏసీ నుంచి భూపాల్‌రెడ్డి పార్టీ టిక్కెట్‌ను నిలబెట్టుకున్నారు.బీ లక్ష్మీనారాయణ (ఖమ్మం ఎల్‌ఏసీ)కి టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించింది. తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పి రాజేశ్వర్ రెడ్డి సన్నిహితుడు టి మధు ఈసారి పోటీ చేయనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పి.సతీష్‌ కుమార్‌ స్థానంలో మరో నేత డి.విట్టల్‌ను ఎంపిక చేసేందుకు కూడా పార్టీ ప్రాధాన్యతనిచ్చింది. ఈ జాబితాతో పాటు క్యాబినెట్ కూర్పు ఈక్వేష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే క‌విత రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.