Site icon HashtagU Telugu

Telangana: విద్యుత్ విషయంలో కిషన్ రెడ్డికి కవిత కౌంటర్

Telangana (75)

Telangana (75)

Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో మూడు వారాల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై అపోహలు చేయవద్దని కిషన్ రెడ్డికి కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కరెంట్ డిమాండ్ 15,500 మెగావాట్లు ఉంటే, తెలంగాణకు ఎన్టీపీసీ 680 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తోందని కవిత ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అంటే తెలంగాణ వినియోగించే విద్యుత్‌లో నాలుగు శాతం మాత్రమే పెద్దపల్లి ఎన్‌టీపీసీ నుంచి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇస్తోందని అసత్యాలు ప్రచారం చేయవద్దని కిషన్ రెడ్డికి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ విద్యుత్ కష్టాలు తీరిపోయిందని, అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్‌గా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కవిత.

పెద్దపల్లిలో ఎన్‌టీపీసీ పవర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తోందని కిషన్‌రెడ్డి ట్విటర్ వేదికగా అంతకుముందు వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు.

Also Read: Revanth Reddy : ధరణి ని తీసివేస్తాం అని మీము చెప్పలేదు – రేవంత్ రెడ్డి

Exit mobile version