MLC Kavitha: తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్ కన్వీనర్ గా బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ గా ఆలకుంట హరి, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావు, మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే ఐకైక లక్ష్యంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. పెంచిన రిజర్వేషన్లను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు విడమరిచి చెప్తామన్నారు. బీసీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు.
Also Read: YCP Criminal Ideology: వైసీపీ నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్న ఘటనలు ఇవే!
యూపీఎఫ్ కో కన్వీనర్లుగా ఆర్ వి మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్ర సాగర్, మల్లేష్ గౌడ్, గొరిగే నరసింహ, గోవర్ధన్ యాదవ్, గుర్రం శ్రవణ్, టి నరేష్ కుమార్, డి కుమార స్వామి, ఏతరి మారయ్య, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృష్ణ, మురళి కృష్ణ, సల్వా చారి, ఫరూక్, కే శ్రీనివాస్, స్రవంత్, రాజు, నాగరాజు, అఖిల్, పరమేశ్వరి, కే వెంకటేష్, అశోక్ రెడ్డి, మాధవ్, మేన గోపీ, జహంగీర్ పాషా, లక్ష్మణ్, నరసింహులు, వి యాదగిరి రావు, లక్ష్మీ నారాయణ, సత్యనారాయణ, గుంటి మంజుల, గీత గౌడ్, రమాదేవి, నిమ్మల నగేష్, కృష్ణమాచారి, తారా సింగ్, శైల, పర్వతాలు, కృష్ణ, టి కలపూర్ణ, శ్రీనివాస్, ఆంజనేయులు, షేక్ లతీఫా, సర్సింహ రాజు, గాదె సామయ్య, శివాజీ, చత్రి మంజుల సాగర్, జె లలితా జగన్ లను నియమించారు.